Movie Reviews

దేవినేని మూవీ రివ్యూ & రేటింగ్!!!

Devineni Movie Review & Rating

చిత్రం: దేవినేని
నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

నటీనటులు:నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,
బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు
బ్యానర్: ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్
నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్
డైరెక్టర్ :-నర్రా శివనాగు

కథ:
బెజవాడలో జరిగిన చరిత్ర జరిగింది జరిగినట్లుగా కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా దేవినేని. రెండు గ్యాంగ్స్ మధ్య గొడవలు ఎలా ప్రారంభం అయ్యాయి ? ఎవరిని ఎవరు చంపుకున్నారు ? మడ్డర్స్ ఎలా జరిగాయి అనే విషయాలు ఈ సినిమాలో చూపించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
దేవినేని నెహ్రు పాత్రలో నందమూరి తరకరత్న, దేవినేని మురళి పాత్రలో అర్జున్ తేజ, చలసాని పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, వంగవీటి రాధ పాత్రలో సీనియర్ నటుడు బెబర్జి, వంగవీటి రంగా పాత్రలో సంతోషం సురేష్, రత్నకుమారి పాత్రలో తనుష్క రెడ్డి, సుబ్బు పాత్రలో లక్ష్మీ నివాస్, సిపిఐ లీడర్ పాత్రలో బాక్స్ ఆఫిస్ రమేష్ అద్భుతంగా నటించారు. ఈ పాత్రలు చూస్తుంటే ఆనాడు బెజవాడలో జరిగిన చరిత్ర కనిపిస్తుంది. ఒక 30 ఏళ్లు వెనక్కు వెళ్లినట్లు ఉంది. దర్శకుడు నర్రా శివనాగు ప్రతిభ ఈ చిత్రానికి అద్దం పట్టిందని చెప్పాలి.

మన తెలుగు ఇండస్ట్రీకి మరో రామ్ గోపాల్ వర్మ ఈ నర్రా శివనాగు. ఆయన మేకింగ్ స్టైల్ , కొత్త నరేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ లో రెండు గంటల 10 నిమిషాల వరుకు ఊపిరి సలుపనివ్వని ఉత్కంఠతో ప్రేక్షకులను థియేటర్ లో కమిట్ చేయించాడని చెప్పాలి. టెక్నీకల్ గా ఈ చిత్రం హై లెవెల్ అల్ట్రా సౌండ్ సిస్టమ్ రేంజ్ లో ప్రతి ప్రేక్షకుడిని కూడా ఆనాటి జరిగిన బెజవాడ చరిత్రలోకి తీసుకొని వెళ్ళింది.


మొత్తానికి దర్శకుడు నర్రా శివనాగు ఈ బెజవాడ కథను కొత్త పంథాలో చూపించి పెద్ద హీరోల కమర్షియల్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా నందమూరి తారకరత్నను పెద్ద హీరోల లిస్టులోకి చేర్చినట్లే అనుకోవాలి. అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా హౌస్ ఫుల్స్ ని రాబట్టుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న ఈ చిత్ర కెప్టెన్ ఆఫ్ ద షిప్ దర్శకుడు శివనాగు సక్సెస్ రేట్ లో ఉన్నట్లే. అక్కడక్కడా డైరెక్టర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఇంప్రెస్ చేస్తుంది. మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మధ్య కాలంలో అల్టిమేట్. నిర్మాతలు జి.ఎస్.ఆర్.చౌదరి మరియు రాము రాథోడ్ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా తెరకెక్కించారు.

రేటింగ్: 3.5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close