MOVIE NEWS

‘సూపర్‌ ఓవర్‌’ స్నీక్‌ పీక్‌ను విడుదల చేసిన హీరో శర్వానంద్

Actor Sharwanand unveils sneak-peek into Super Over

తెలుగు వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుని వారికి తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ‘ఆహా’. ఈ అన్‌లిమిటెడ్‌ ఎంటైనింగ్‌ ఛానెల్‌లో జనవరి 22న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ‘సూపర్‌ ఓవర్‌’ చిత్రం. ఈ సినిమా స్నీక్‌పీక్‌ను శనివారం యువ కథానాయకుడు శర్వానంద్ విడుదల చేశాడు. రీసెంట్‌గా ఆహాలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకులను మెప్పించిన ‘మెయిల్‌’ సినిమాతో పాటు ‘మా వింతగాథ వినుమా, కలర్‌ఫొటో, ఒరేయ్‌ బుజ్జిగా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో పాటు సమంత అక్కినేని వ్యాఖ్యాతగా చేసిన ‘సామ్‌జామ్‌’ టాక్‌ షో, హర్ష చెముడు చేసిన కామెడీ షో ‘తమాషా’ వంటి కార్యక్రమాలు తెలుగు వారిని అలరించాయి. 
‘సూపర్‌ ఓవర్‌’  సినిమాను దివంగ‌త ద‌ర్శ‌కుడు‌ ప్రవీణ్‌ వర్మ తెరకెక్కించారు.  సుధీర్‌ వర్మ నిర్మాత‌. థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, చాందిని చౌదరి, అజయ్‌, రాకేందు మౌళి తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం స్నీక్‌పీక్‌ను ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసిన శర్వానంద్‌ ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇదివరకే ఆహాలో విడుదలైన  ‘భానుమతి అండ్‌ రామకృష్ణ’తో నవీన్‌ చౌదరి, ‘కలర్‌ఫొటో’తో చాందిని చౌదరి సూపర్‌హిట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించిన ‘సూపర్‌ ఓవర్‌’ ఎలా ఉంటుందోననే ఆసక్తి పెరిగింది. 
ఎప్పుడైనా ఎక్కడైనా అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న తెలుగువారి ఓటీటీ ‘ఆహా’ను రూ.365 చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ సొంతం చేసుకోచ్చు. తక్కువ సమయంలోనే తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపచంలో ఆహా తనకుంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తెలుగువారి ఫేవరేట్‌ సూపర్‌స్టార్స్‌ నటించిన చిత్రాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు, ఆహా ఒరిజినల్స్ ప్రేక్షకులను రంజింప చేస్తున్నాయి.

&&&&&&&&

Late Director Praveen Varma’s directorial venture, Super Over to release on aha on January 22. Thrilling sneak peek launched by actor Sharwanand earlier today.
After churning back-to-back blockbusters like Colour Photo, Maa Vintha Gaadha Vinuma and Orey Bujjiga alongside much-loved talk shows like Sam Jam hosted by Samantha Akkineni and Tamasha With Harsha hosted by Harsha Chemudu, aha is now all set to release thriller Super Over, helmed by late director Praveen Varma, and produced by Sudheer Varma is aha’s next big bet after the film Mail that is impressing critics and audience alike!
This thriller stars Naveen Chandra, Chandini Chowdary, Ajay and Rakendu Mouli in the lead roles. A story based on cricket betting, the film is a fresh take on the Hawala world for the Telugu audience.A sneak-peek of the film was launched by actor Sharwanand earlier today via a tweet where he congratulated the cast and crew.Notably, Naveen and Chandini have both scored superhits on aha prior to this, with Bhanumathi & Ramakrishna and Colour Photo and aha is quite excited to have them both come together for a thrilling ride.
With aha’s wide range of movies available at a discounted price of Rs 365 for the annual subscription, there’s no stopping unlimited Telugu entertainment anytime, anywhere. In a short span of time, aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites starring superstars and a huge library of classics and original web series, aha is constantly giving its viewers a lot to look forward to.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close