
Azharuddin son to Marry of Sania Mirza sister

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా త్వరలో వివాహనికి ఏర్పాట్లు చకా చకా జరుగుతున్నాయి. త్వరలోనే అసదుద్దీన్-ఆనమ్ మిర్జా వివాహా బంధంలో ఒక్కటి కాబోతున్నారు.
ఇప్పటికే ఈ రెండు కుటుంబాలు కలిసి వీరిద్దరి నిశ్ఛితార్థ వేడుకను ఘనంగా నిర్వహించాయి. డిసెంబర్ మూడో వారంలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివాహానికి ముందు సానియా సోదరి ఆనమ్ తన స్నేహితులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది.
ఈ విందులో భాగంగా వధువు అలంకరణ ఫోటోలను, వీడియోలను ఆనమ్ తన స్నేహితులతో పంచుకుంది. దీంతో పాటు ఆనమ్ తన సోదరి సానియాతో కలసి స్నేహితురాళ్లతో దిగిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, ఆనమ్ మిర్జాకు ఇది రెండో వివాహం కావడం విశేషం. తన మాజీ భర్త అక్బర్ రషీద్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా అసద్, ఆనమ్‌లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు అసదుద్దీన్-ఆనమ్‌లు తీసుకెళ్లారు.
మరోవైపు మహ్మద్ అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా, ఒకరు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన బైక్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.