MOVIE NEWS

అవార్డులకు-రివార్డులకు కావాలి మీ దారి “జాతీయ రహదారి” -ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సందర్భంగా జాతీయ సంచలన రచయిత విజయేంద్రప్రసాద్

Awards-Rewards Want Your Way "National Highway" - National Sensational Writer Vijayendra Prasad at the launch of First Look

 నంది అవార్డుల కోసం తహతహలాడుతున్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ..

మధుచిట్టి,సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి,అభి,శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న”జాతీయ రహదారి” చిత్రం టీజర్,ఫస్ట్ లుక్ను గ్రేట్ డైరెక్టర్,రైటర్,శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారి చేతులమీదుగా లాంచ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా

 శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. నరసింహనంది నాకు చాలాకాలంగా తెలుసు. మాదగ్గర చాలా సినిమాలకు వర్క్ చేసాడు.అతని డెడికేషన్ అంటే నాకు చాలా ఇష్టం.అతని దర్శకత్వంలో రూపొందిన అన్ని సినిమాలు అనేక అవార్డులు గెలుచుకున్నాయి.”జాతీయ రహదారి” కి కూడా గ్యారంటీగా నందిఅవార్డ్ వస్తుంది.ఈ సినిమాకు అవార్డులతో పాటు రివార్డులు కూడా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

 నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ. . శతాధిక చిత్ర నిర్మాతగా పేరున్నా తృప్తిని కలిగించలేదు.నరసింహనంది నాకు కథ చెప్పడంతో నాకు ఈ కథ డిఫరెంట్ గా అనిపించింది.అప్పుడు నాకు నరసింహనంది తో తీసే ఈ “జాతీయ రహదారి” సినిమాతో నంది అవార్డు తీసుకుంటాననే నమ్మకం కలిగింది.నరసింహనందిలో ఉండే తపన చూసి అతనికి నచ్చిన కథ, అతనికి సంబంధించిన జోనర్ లో ఈ కథను ఎన్నుకోవడం జరిగింది.నంది అవార్డు కోసమే ఈ సినిమా తీశాము.”నేను వందకు పైగా సినిమాలు తీసినా కలగని సంతృప్తి ‘జాతీయ రహదారి’ ఇచ్చింది. నిర్మాతగా నేను గర్వపడే చిత్రాల్లో ‘జాతీయ రహదారి’ ఒకటిగా నిలుస్తుంది. విజయేంద్రప్రసాద్ గారి నోటి చలవ వల్ల ఈ చిత్రంతో నేను నంది, సింహ (తెలంగాణ ప్రభుత్వ పురస్కారం) అవార్డులు గెలుచుకోవడం ఖాయం”అని అన్నారు.

 సంధ్య స్టూడియోస్ అధినేత రవి మాట్లాడుతూ… రామసత్యనారాయణకు ఎన్ని సినిమాలు తీసినా తృప్తిలేదు,కానీ నరసింహ నంది తీసే సినిమాలకు మాత్రం కచ్చితంగా అవార్డ్ వస్తుందని ఏంతో ఆశతో ఉన్నారు.ఈ సినిమా మొత్తం మా స్టూడియోలో పోస్ట్,ప్రొడక్షన్ జరిగింది.నేను ఈ సినిమా చూడడం జరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల అవార్డులతోపాటు.. జాతీయస్థాయిలోనూ అవార్డ్స్ వచ్చే కంటెంట్ ఉంది” అని అన్నారు.

 దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ..” ఇప్పటి వరకు నేను 6 సినిమాలకు దర్శకత్వం వహించాను.అందులో 4 సినిమాలకు జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డులు అందుకోవడం జరిగింది.2021లో మేము నంది అవార్డ్ తీసుకొనేలా కథ రాసుకున్నాము. రామసత్యనారాయణ గారికి ఈ కథ చెప్పినపుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ కథను నీకు నచ్చిన పద్దతిలో తీయమని చెప్పడం జరిగింది.ఒక దర్శకుడినే కాకుండా,నిర్మాణ బాధ్యతలు కూడా నా భుజంపై వేయడం వల్ల ఈ సినిమాను ఇంకొంచెం శ్రద్ధగా తీయడం జరిగింది.ప్రతి సినిమాకు నిర్మాత ఇన్వాల్ మెంట్ ఉంటుంది.కానీ ఇందులో తాను ఏ విదమైన ఇన్వాల్వ్ కాకుండా…ఈ సినిమా విజయం సాధిస్తే.. తనకు విజయం వస్తుందనే ద్యేయంతో నన్ను నమ్మి  ఈ చిత్రం అప్పజెప్పాడు.నేను ఈ సినిమాను అద్భుతముగా తెరకెక్కించాను.లాక్ డౌన్ బాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఈ కథ ముఖ్యంశాలను తరువాత ప్రెస్ మీట్ లో తెలియజెస్తాం.ప్రతి ఆర్టిస్టులు,టెక్నీషియన్స్ అందరూ ఇది నా సినిమా అనుకోని కష్ట పడి పనిచేశారు.నా ప్రతి సినిమా విజయం సాధిస్తుంది అంటే నా టీం వర్క్ పాత్ర ఎంతో ఉంది.నాకెంతో ఇష్టమైన విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది.ఇంతమంచి అవకాశం లభించిన నాకు ఈ 2021 సంవత్సరం మా ప్రయాణం విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నాను.సత్యనారాయణ గారితో నేను మరొక్క సినిమా చేయడానికి కథ రెడీ చేసుకొంటున్నానని అన్నారు.

 నటీనటులు…

మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి…

 సాంకేతిక నిపుణులు…

నిర్మాత… తుమ్మలపల్లి రామసత్యనారాయణ

రైటర్, డైరెక్టర్… నరసింహ నంది

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..సంధ్య స్టూడియోస్.

సంగీతం… సుక్కు

పాటలు..మౌనశ్రీ

కెమెరా..మురళి మోహన్ రెడ్డి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close