
MOVIE NEWS
దమయంతి చిత్రాన్ని కాళికా పేరుతో నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్
Karuna and Nutty Krantilu remake of Damayanti movie in Telugu under the name Kalika
క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి ప్రధాన పాత్రలో సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని కాళికా పేరుతో నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్ చేసి విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ ..రాధికా కుమారస్వామి హీరోయిన్ గా లీడ్ పాత్రలో కన్నడలో సూపర్ హిట్ అయిన దమయంతి చిత్రాన్ని తెలుగులో కాళికా గా రిమేక్ చేస్తున్నాము. ఈ సినిమాను 18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను అడుగడుగున టెన్షన్ కలిగిస్తూ మెప్పిస్తుంది. సినిమా అద్బుతంగా వచ్చింది.కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని
అన్నారు.