MOVIE NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 తెలుగు ఫేం సోహెల్

Bigg Boss 4 Telugu Fame Sohel who adopted Green India Challenge and planted plants

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 తెలుగు ఫేం సోహెల్.

ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుంది. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బు లు ఇచ్చి కోనుకుంటున్నాము అని రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదు అంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని కోరారు.
దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎం.పి సంతోష్ కుమార్ గారికి మరియు నాకు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తాను మరో ముగ్గురు ( అరియానా , మెహబూబ్ , అఖిల్ ) లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సోహెల్ కు వృక్షవేదం పుస్తకం ను అందజేయడం జరిగింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close