
`ఆచార్య` సెట్లో కాజల్ – గౌతమ్ కిచ్లు జంటకు మెగా శీస్సులు
Kajal Aggarwal & Gautam Kitchlu Took Blessings From Megastar Chiranjeevi
చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ మంగళవారం ఉదయం ఆచార్య
షూటింగ్ లో జాయినయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేట లో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం ఉదయం కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఆచార్య సెట్స్ కి విచ్చేసి చిత్ర బృందాన్ని సర్ ప్రైజ్ చేశారు. కాజల్ – కిచ్లు జంటకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జంటతో దండలు మార్పించి కేక్ కట్ చేయించి మెగాస్టార్ చిరంజీవి కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా చిత్ర దర్శకులు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్, సహ నిర్మాత అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు