MOVIE NEWS

నిర్మాత ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో షూటింగ్ కంప్లీట్ చేసుకొన్న “ప్రొడక్షన్ నెం.2” చిత్రం

Production Mulleti Nageswara Rao directed the production and completed the production of "Production No.2"

నిర్మాత ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో జి.వి.ఆర్.ఫిల్మ్ మేకర్స్ పతాకంపై రాజధాని ఆర్ట్ మూవీస్ సమర్పణలో “ప్రొడక్షన్ నెం.2” చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రానికి దర్శకత్వం వెంకట్ వందెల. ద్వారక తిరుమల చిన్న తిరుపతిలో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. రెండో షెడ్యూల్ పాలకొల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా

దర్శకుడు మాట్లాడుతూ… ముఖ్యంగా సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి గారు బిజీ షెడ్యూల్ లో ఉన్నా కోవిడ్ టైం లో ధైర్యం చేసి ముందుకు వచ్చి నిర్మాతలు నష్టపోగుడదని షూటింగ్ కంప్లీట్ చేస్తూ మాకు కొన్ని కొన్ని సలహాలు ఇస్తూ మాకు ప్రొడక్షన్ లో ఎంతో సహకరించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.”ఈ చిత్రం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఇదే ఉత్సాహం తో చివరి షెడ్యూల్ ను కంప్లీట్ చేసాం. దీంతో ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. మిగతా విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం. చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైంకి కంప్లీట్ చేసున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాతలు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడటం లేదు. సినిమాని రిచ్ గా తీయాలనేదే నిర్మాతల తపన. అలాగే హీరో, హీరోయిన్ బాగా సహకరిస్తున్నారు. ఈమధ్యనే చివరి షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసాం అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ..డైరెక్టర్ అనుకున్న టైం కు ఔట్ ఫుట్ ఇవ్వగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కు రావాలి.హుషారు ఫేమ్ కురపాటి గని కృష్ణ తేజ్ వేరే,వేరే డేట్స్ లో ఉన్న సరే చాలా మందితో మాట్లాడి మాకు రెస్పాన్డ్ అయ్యి కోవిడ్ టైం లో షూటింగ్ కంప్లీట్ చేసి నిర్మాతకు అండగా నిలిచిన హుషారు ఫేమ్ కురపాటి గని కృష్ణ తేజ్ లాంటి వారు ఇండస్ట్రీ కు ఎంతో అవసరం తను ఫ్యూచర్ లో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను.”కరోనా కంటే ముందే రెండు షెడ్యూల్ లను పూర్తి చేసాం. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్తున్నాము. సినిమా బాగా వచ్చింది. నటీనటులు కూడా బాగా సహకరిస్తున్నారు అని అన్నారు..

ఈచిత్రంలో “హుషారు” ఫేమ్ కురపాటి గని కృష్ణ తేజ్, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తుండగా… సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సెకెండ్ హీరోయిన్ గా కల్పనా రెడ్డి నటిస్తున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో జీవా, జోగి బ్రదర్స్, అనంత్, బస్ స్టాప్ కోటేశ్వరరావ్, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ముల్లేటి కమలాక్షి , గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మాతలు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వెంకట్ వందెల, సినిమాటోగ్రఫీ: పి. వంశీ ప్రకాశ్, సంగీతం: సందీప్ కుమార్, స్క్రీన్ ప్లే-పాటలు: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి, ఎడిటర్: నందమూరి హరి, స్టంట్స్: రామకృష్ణ, కొరయోగ్రఫీ: గణేష్ స్వామి, నందెపు రమేష్, చీఫ్ కో డైరెక్టర్: ఎల్. రామకృష్ణం రాజు , పి.ఆర్. ఓ.: మధు వి.ఆర్.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close