MOVIE NEWS

రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ‘డి.ఎస్.జె’ టీజర్ !

'DSJ' teaser released by Rangopal Varma

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ క్విటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో శ్రీమతి నట్టి లక్ష్మీ సమర్పణలో వస్తోన్న చిత్రం. డి.ఎస్.జె (దెయ్యంతో సహ జీవనం) రాజు సాలూరి, నట్టి కరుణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నట్టి కుమార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ నట్టి కరుణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ…
నేను గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఇప్పుడు నా దర్సకత్వంలో నా కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటించడం నాకు సంతోషం. నేను నా కూతురికి పాటలు నేర్పినట్లు ఉంది. అలాగే నా కుమారుడు నట్టి క్రాంతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మేము అడిగినవన్నీ మాకు సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో నా కొడుకు, కూతురు నిర్మాతగా హీరోయిన్ గా వ్యవహరించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయి రోషన్ సాలూరి హీరో అద్భుతంగా నటించాడు. కరోనా సమయంలో కూడా మేము అడగ్గానే మా సినిమా చేసినందుకు రోషన్ సాలూరికి ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ…
మా సినిమా డి.ఎస్.జె టీజర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. కరోన సమయంలో అందరూ బాగా సహకరించడం వల్ల షూటింగ్ ఈజీగా పూర్తి అయ్యిందని తెలిపారు.

హీరో రోషన్ సాలూరి మాట్లాడుతూ…
నట్టికుమార్ గారు సినిమాను బాగా తెరకెక్కించారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది. నట్టి కరుణ బాగా నటించింది, నటిగా తనకు మంచి భవిషత్తు ఉంటుంది. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. నట్టి క్రాంతి సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారని తెలిపారు.

నటీనటులు:
హీరో: రాజు సాలూరి
హీరోయిన్: నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్
హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: నట్టి కుమార్
నిర్మాత: నట్టి క్రాంతి
కెమెరామెన్: కోటేశ్వర రావు
సంగీతం: ఎస్.ఏ.కుద్దుస్
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: కెవి.రమణ
ఫైట్స్: కె.అంజిబాబు
పిఆర్ఒ: మధు.విఆర్

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close