
అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో లెజెండ్ అయిన భారత ప్లేయర్ లియాండర్ పేస్ తన ప్రపంచ రికార్డును మరింత మెరుగుపర్చుకుంటూ పోతున్నాడు.
తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పేస్-జీవన్ నెడుంజెళియన్ జంట విజయం సాధించడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టైని సొంతం చేసుకుంది.
ఆ మ్యాచ్‌లో పేస్ జోడీ 6-1, 6-3తో పాక్ ప్లేయర్లు మహ్మద్ షోయబ్-హుఫైజా అబ్దుల్ రహమాన్ జంటపై సునాయాస విజయం సాధించింది.
కేవలం 53 నిమిషాల్లో జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ జోడీ ధాటికి ప్రత్యర్థి వద్ద సమాధానం లేకపోయింది. అనంతరం జరిగిన రివర్స్ సింగిల్స్‌లో సుమిత్ నాగల్ 6-1,6-0తో యుసఫ్ ఖలీల్‌పై అలవోకగా గెలుపొందాడు.
దీంతో 4-0తో గెలుపొందిన భారత్ ప్రపంచ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది