
MOVIE NEWS
“కరోనా వైరస్” మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేశా – దక్షి గుత్తికొండ
Challenging role in the movie "Corona Virus" - Dakkshy Guthikonda
ఆర్జీవీ “కరోనా వైరస్” సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు దక్షి గుత్తికొండ. ఈ సినిమాలో నటించిన ఎక్సీపిరియన్స్ ను దక్షి తెలిపింది.
దక్షి గుత్తికొండ మాట్లాడుతూ…” సామాజిక మాధ్యమాల్లో ఉన్న నా గ్లామర్ ఇమేజ్ కి సినిమాలో చేసిన రోల్ కి అస్సలు సంబంధం ఉండదు. ఒక తెలుగు ఫ్యామిలీ లో తమిళ కోడలి గా వంశీ చాగంటి కి వైఫ్ గా కనిపిస్తాను. నా మొదటి సినిమాలోనే డీ గ్లామ్ క్యారెక్టర్ చెయ్యటం ఛాలెంజింగ్ గా అనిపించింది. కరోనా టైం లో తెలుగమ్మాయి అయిన నాకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులేమి పెట్టుకోలేదు. ఒకవేళ కథ నచ్చితే ఏ తరహా పాత్ర అయినా పోషిస్తాను. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్దమే.” అని చెప్పింది.